భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరణ ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోబోతుందా
February 2, 2026

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ నిరాకరించడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు ఐసీసీకి ఎటువంటి అధికారిక లేదా లిఖితపూర్వక సమాచారం అందించలేదు. పీసీబీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఐసీసీ క్రమశిక్షణా చర్యలు లేదా నిషేధంపై ఆలోచించే అవకాశం ఉంది.
గ్రూప్ ‘ఏ’లో భారత్‌తో కలిసి ఉన్న పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. పీసీబీ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే ఈ వివాదంపై ఐసీసీ ఒక తుది నిర్ణయానికి రానుంది.