భారత్‌కు తిరిగి వస్తేనే విచారణ, విజయ్ మాల్యా పిటిషన్‌పై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

భారత్‌కు తిరిగి వస్తేనే విచారణ, విజయ్ మాల్యా పిటిషన్‌పై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తన్ను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి, హాజరుకాని వ్యక్తులకు ఎటువంటి ఉపశమనం పొందే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడు స్వయంగా కోర్టుకు రానంత వరకు ఈ కేసులో ఎటువంటి విచారణ జరగదని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు.

ప్రస్తుతానికి మాల్యా పిటిషన్‌ను కొట్టివేయకుండా కోర్టు ఆయనకు మరో చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణలోగా మాల్యా ఖచ్చితంగా కోర్టుకు వస్తారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా తన నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశాల్లో పేర్కొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *