భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్: వేగం బాగానే ఉంది, కానీ ధర?

భారతదేశంలో స్టార్‌లింక్ (Starlink) ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వార్త బయటకొచ్చిన వెంటనే టెక్నాలజీ ప్రపంచంలో ఉత్కంఠ నెలకొంది. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ నిర్వహిస్తున్న ఈ సేవను మొదట పట్టణాల్లో, ఆపై గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ, ఇది టవర్ లేదా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇది అందుబాటులో లేని ప్రదేశాల్లో వేగంగా ఇంటర్నెట్‌ను అందించగలదు, కానీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. జియో, ఎయిర్‌టెల్ 5G ప్లాన్లు ₹599-₹699కే లభిస్తుండగా, స్టార్‌లింక్ సేవ మాత్రం నెలకు సుమారు ₹10,500 ఖర్చు అవుతుంది. అందువల్ల, అత్యాధునికమైనా సరే, ధర సామాన్య వినియోగదారుల చేతికి అందుబాటులో ఉండకపోవచ్చు.