భర్తే దగ్గరుండి పెళ్లి చేశాడు: ‘నువ్వు వెళ్లు, పిల్లలను నేను చూసుకుంటాను’ అని భార్యకు అప్పగించిన భర్త!

భర్తే దగ్గరుండి పెళ్లి చేశాడు: ‘నువ్వు వెళ్లు, పిల్లలను నేను చూసుకుంటాను’ అని భార్యకు అప్పగించిన భర్త!

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో, భార్య తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి భర్తే అంగీకరించిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. 2017లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భర్తను విడిచిపెట్టి ప్రియుడితో జీవించాలని భార్య కోరుకున్నప్పుడు, భర్త ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఈ నిర్ణయాన్ని అంగీకరించారు.

భర్త స్వయంగా తన భార్యకు, ఆమె ప్రియుడికి ఒక ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో వివాహం జరిపించారు. తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకున్న భార్య, తన ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంగీకరించారు. పిల్లలను తానే చూసుకుంటానని భర్త నిర్ణయించుకోవడంతో ఈ సంఘటన సమాజంలో చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *