భర్తపై కోపంతో 4 లక్షల రూపాయలు నమిలి మింగేసిన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలింపు

భర్తపై కోపంతో 4 లక్షల రూపాయలు నమిలి మింగేసిన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలింపు

కొలంబియాలో ఒక దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఊహించని మలుపు తిరిగింది. విహారయాత్రకు వెళ్లాలనే ప్లాన్ విషయంలో భర్తతో విభేదించిన భార్య తీవ్ర ఆవేశానికి లోనై తాను దాచుకున్న 7000 డాలర్లు అంటే సుమారు 4 లక్షల రూపాయల నగదును నమిలి మింగేసింది. కోపం మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తుందో ఈ ఘటన నిరూపించింది.

నగదు మింగడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో ఉన్న నోట్లను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడగా అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆ దంపతులకు సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *