బిపి 120/80 కంటే కొంచెం పెరిగినా ప్రమాదమే, గుండె నిపుణుడి సంచలన హెచ్చరిక

బిపి 120/80 కంటే కొంచెం పెరిగినా ప్రమాదమే, గుండె నిపుణుడి సంచలన హెచ్చరిక

న్యూస్ డెస్క్ : మీ రక్తపోటు (బిపి) 130 లేదా 140 కి చేరుకున్నప్పుడు అది సాధారణమే అని సరిపెట్టుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే అని హెచ్చరిస్తున్నారు 30 ఏళ్ల అనుభవం ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇవాన్ లెవిన్. రక్తపోటు సరిగ్గా 120/80 ఉండటం అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది మీ గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించే కీలకాంశం. ఈ రీడింగ్ కొద్దిగా పెరిగినా, అది గుండెపోటు మరియు పక్షవాతం వచ్చే అవకాశాలను సైలెంట్‌గా పెంచుతుందని సామాన్యులు గమనించాలి.

ఆసుపత్రిలో ఒత్తిడి వల్ల బిపి రీడింగ్స్ తప్పుగా వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు బిపిని చెక్ చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మీ బిపి 120/80 కంటే ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు ఒకసారి మందులు వేసుకోవడం ద్వారా బిపిని అదుపులో ఉంచుకోవడం చాలా సులభం. మీ ఆయుష్షు పెంచుకోవాలంటే ‘దరిదాపుల్లో ఉంది’ అని కాకుండా, ‘ఖచ్చితంగా ఉంది’ అని నిర్ధారించుకోవడమే ఉత్తమ మార్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *