బాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు: శ్రీలీల

బాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు: శ్రీలీల

హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్‌లో సెటిల్ అవుతారనే వార్తలను ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు టాలీవుడ్‌ ఇల్లు లాంటిదని, ఇక్కడే కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదవడం వల్ల కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ప్రస్తుతం శ్రీలీల, నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీటిపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *