బంగ్లాదేశ్ లో బీఎన్పీ ప్రభంజనం
February 13, 2026

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తారెక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ 171 స్థానాల్లో విజయం సాధించగా, జమాత్-ఇ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది.
తుది ఫలితాల ప్రకటనకు ముందే బీఎన్పీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎన్నికలతో పాటు డాక్టర్ ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరిపాలనా సంస్కరణల బిల్లుకు కూడా ప్రజాభిప్రాయ సేకరణలో భారీ మద్దతు లభించడం విశేషం.