ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా, ఈ 5 పదార్థాలు మీ ప్రాణాలకే ప్రమాదం

న్యూస్ డెస్క్ : బిజీ లైఫ్ వల్ల మనం చాలా వరకు వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని, మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటుంటాం. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తుందో తెలుసా? వైద్యుల ప్రకారం, 48 గంటల కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉన్న ఆహారం పోషకాలను కోల్పోవడమే కాకుండా, అందులో ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతుంది. ఇలాంటి ఆహారం తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా అన్నం, చికెన్, గుడ్లు మరియు ఆకుకూరలను మళ్ళీ వేడి చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉదాహరణకు, పాలకూర వంటి ఆకుకూరలను పదే పదే వేడి చేస్తే అవి విషపూరితంగా మారి క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే వండిన ఆహారాన్ని మూడు రోజుల్లోపు తినేయాలి మరియు ఒక్కసారి కంటే ఎక్కువ వేడి చేయకూడదు. తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడమే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని మర్చిపోవద్దు.