ఫీల్డింగ్ తప్పిదాలు.. బ్యాటింగ్ లోపమే మా ఓటమికి కారణం: గిల్

ఫీల్డింగ్ తప్పిదాలు.. బ్యాటింగ్ లోపమే మా ఓటమికి కారణం: గిల్

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంగీకరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, “బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చేయడం, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేయడం వల్ల మేము వెనుకబడ్డాం. ఛేజింగ్ సమయంలో కీలకమైన మూడు ఓవర్లలో తక్కువ పరుగులు చేయడం కూడా ఓటమికి కారణమైంది” అని పేర్కొన్నారు.

పంజాబ్ బౌలర్ వైశాక్ అద్భుతమైన యార్కర్లతో తమ ఆటను కష్టతరం చేశాడని గిల్ పేర్కొన్నారు. “15 ఓవర్ల తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఆ స్థాయిలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కానీ వైశాక్ అద్భుతంగా చేశాడు” అని ఆయన ప్రశంసించాడు. GT జట్టు రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి పొరపాట్లను సరిచేసుకోవాలని గిల్ అభిప్రాయపడ్డాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *