ప్రియుడితో వీడియో కాల్ లో ఉండగా పట్టుకున్న భర్తపై దాడి రోకలి బండతో భర్త ముక్కు ఎముక విరగ్గొట్టిన భార్య

ప్రియుడితో వీడియో కాల్ లో ఉండగా పట్టుకున్న భర్తపై దాడి రోకలి బండతో భర్త ముక్కు ఎముక విరగ్గొట్టిన భార్య

ముజఫర్‌పూర్ జిల్లా అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం కారణంగా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. రవికుమార్ అనే వ్యక్తి తన భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను గమనిస్తూ వచ్చాడు. నిన్న రాత్రి అతను ఇంటికి వచ్చేసరికి తన భార్య ఒక వ్యక్తితో వీడియో కాల్ లో మాట్లాడుతుండటం చూసి షాక్ అయ్యాడు. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా, ఆగ్రహించిన భార్య వంటింట్లోని రోకలి బండతో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ దాడిలో రవికుమార్ తల పగిలి తీవ్ర రక్తస్రావం అవడమే కాకుండా ముక్కు ఎముక కూడా విరిగింది. బాధితుడి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని కాపాడి చికిత్స నిమిత్తం ఎస్కేఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అహియాపూర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *