ప్రపంచ వరి ఉత్పత్తిలో చైనాను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి చేరుకున్న భారత్
January 2, 2026

ప్రపంచ వరి ఉత్పత్తి రంగంలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ చైనా ఆధిపత్యానికి తెరదించింది. యూఎస్ వ్యవసాయ శాఖ (USDA) తాజా గణాంకాల ప్రకారం, భారత్ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలవగా, చైనా 146 మిలియన్ మెట్రిక్ టన్నులకే పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న వరిలో భారత్ వాటా ప్రస్తుతం 28 శాతానికి పైగా ఉండటం విశేషం.
భారతదేశం నుండి సుమారు 172 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతుల ద్వారా భారత్ రూ. 1,05,720 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. సుమారు 60,000 రకాల వరి వంగడాలతో భారత్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో తిరుగులేని ‘రైస్ కింగ్’గా అవతరించింది.