పెళ్లైన 24 గంటల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు షాక్‌లో వరుడు

పెళ్లైన 24 గంటల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు షాక్‌లో వరుడు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన కేవలం ఒక్క రోజులోనే నవవధువు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దంకౌర్ ప్రాంతానికి చెందిన యువకుడికి బులంద్‌షహర్‌కు చెందిన యువతితో సోమవారం ఘనంగా వివాహం జరిగింది. మరుసటి రోజు మంగళవారం సాయంత్రం వధువుకు కడుపునొప్పి రావడంతో అత్తగారింటి వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భిణి అని చెప్పడమే కాకుండా, కొద్దిసేపటికే ఆమె ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయం తెలిసిన వరుడు మరియు అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమకు తెలియకుండా ఈ విషయాన్ని దాచి మోసం చేశారని వరుడి తరపు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువును తమతో ఉంచుకోవడానికి వరుడు నిరాకరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. చివరికి వధువు తరపు వారు వచ్చి ఆమెను, పసిబిడ్డను తీసుకుని తిరిగి బులంద్‌షహర్‌కు వెళ్ళిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *