పురందేశ్వరి చేతుల్లో దేశ విద్యావ్యవస్థ భవితవ్యం మోదీ సర్కార్ మాస్టర్‌స్ట్రోక్

పురందేశ్వరి చేతుల్లో దేశ విద్యావ్యవస్థ భవితవ్యం మోదీ సర్కార్ మాస్టర్‌స్ట్రోక్

భారతీయ ఉన్నత విద్యా రంగంలో పెనుమార్పులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ విద్యా అధిష్ఠాన్ (VBSA) బిల్లు-2025’ను తీసుకువస్తోంది. ‘ఒకే దేశం – ఒకే నియంత్రణ సంస్థ’ నినాదంతో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ వంటి ప్రస్తుత సంస్థల స్థానంలో ఒకే కేంద్రీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపాదించిన ఈ బిల్లుకు యూజీసీ, ఏఐసీటీఈ ఇప్పటికే తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.

ప్రస్తుతం ఈ కీలక బిల్లును ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలిస్తోంది. ఈ కొత్త 12 మంది సభ్యుల కమిషన్ ఏర్పాటు ద్వారా క్రెడిట్ బదిలీలు, అంతర్-విద్యా కోర్సులు సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా 2035 నాటికి ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు రేటును 50 శాతానికి పెంచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బతినడమే కాకుండా, నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు విధించే అధికారం కేంద్రం చేతుల్లోకి వెళ్లడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల అంశంపై స్పష్టత లేకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *