పీఎఫ్ ఖాతాలకు కొత్త నిబంధన, ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి

పీఎఫ్ ఖాతాలకు కొత్త నిబంధన, ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాల నిబంధనలను మార్చింది. ఇకపై, కొత్త పీఎఫ్ చందాదారులు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) సృష్టించుకోవడానికి ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి. గతంలో వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్‌లు ఉపయోగించేవారు, ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ కేవలం ముఖ గుర్తింపు ద్వారా మాత్రమే జరుగుతుంది.

‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ వంటి కొత్త ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ కఠినమైన చర్య తీసుకున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యం. గతంలో ఇలాంటి పథకాల్లో మోసాలు జరగడం వల్ల ఈ కొత్త విధానాన్ని అమలు చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *