పిచ్చికుక్క కరిచిన మేక మాంసం తిన్న 400 మంది గ్రామంలో తీవ్ర ఆందోళన
January 2, 2026

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా సర్గావ్ గ్రామంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 28న జరిగిన గ్రామ పూజలో 13 మేకలను బలి ఇచ్చారు, అందులో ఒక మేకను గతంలో పిచ్చికుక్క కరిచింది. ఆ మేక మాంసాన్ని దాదాపు 400 మంది గ్రామస్థులు ఆహారంగా తీసుకోవడంతో, ఇప్పుడు అందరికీ రేబిస్ వ్యాధి సోకుతుందేమో అన్న భయం పట్టుకుంది.
ఈ విషయంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేకకు ఇన్ఫెక్షన్ ఉందని తెలిసి కూడా బలికి అనుమతించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, బాధితులందరికీ యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇవ్వాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.