పాకిస్థాన్ కేవలం టాయిలెట్ పేపర్ మాత్రమే, అమెరికాపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
February 11, 2026

అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుని, ఆపై ‘టాయిలెట్ పేపర్’ లాగా పక్కన పడేసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారు. 1999 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాతో సన్నిహితంగా ఉండటం ఇస్లామాబాద్ చేసిన అతిపెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పాకిస్థాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అవసరం తీరిన తర్వాత అమెరికా తమను విస్మరించిందని, స్నేహం పేరుతో పాకిస్థాన్‌ను కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడుకుందని ఆయన విమర్శించారు. రక్షణ మంత్రి చేసిన ఈ ఘాటైన విమర్శలు అమెరికా మరియు పాకిస్థాన్ మధ్య ఉన్న ప్రస్తుత సంబంధాలలోని బీటలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.