పసిడి ప్రియులకు భారీ షాక్! ఒక్కరోజే రూ.28,900 పెరిగిన బంగారం ధరలు
February 7, 2026

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.2,890 పెరగగా, 100 గ్రాములపై ఏకంగా రూ.28,900 మేర భారీ పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో నేడు ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,660 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధర కూడా నేడు పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై రూ.10,000 పెరిగి, ప్రస్తుతం మార్కెట్లో రూ.2,85,000 వద్ద విక్రయించబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల వల్లే ఈ ఆకస్మిక ధరల పెరుగుదల సంభవించిందని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.