పవిత్ర రంజాన్ వేళ అఫ్గాన్‌పై పాక్ భీకర దాడులు భారత్ తీవ్ర ఆగ్రహం
February 23, 2026

అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన వాయుసేన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా సామాన్య పౌరులపై దాడులు చేయడం అమానుషమని విదేశాంగ శాఖ పేర్కొంది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి రక్తపాతానికి ఒడిగట్టిందని భారత్ విమర్శించింది.
అఫ్గాన్ సార్వభౌమత్వానికి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రణధీర్ జయస్వాల్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టామని పాక్ వాదిస్తున్నప్పటికీ, మరణించిన వారంతా అమాయక గ్రామస్థులని అఫ్గాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. పాక్ చర్యలు ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని భారత్ హెచ్చరించింది.