పవర్‌ఫుల్ బ్యాటరీ మరియు అదిరిపోయే ఫీచర్లతో టిసిఎల్ సరికొత్త డిజిటల్ పేపర్ టాబ్లెట్ లాంచ్

పవర్‌ఫుల్ బ్యాటరీ మరియు అదిరిపోయే ఫీచర్లతో టిసిఎల్ సరికొత్త డిజిటల్ పేపర్ టాబ్లెట్ లాంచ్

ప్రముఖ టెక్ సంస్థ టిసిఎల్ గ్లోబల్ మార్కెట్‌లో టిసిఎల్ నోట్ ఏ1 నెక్స్‌ట్‌పేపర్ పేరిట సరికొత్త ఈ-నోట్ డివైజ్‌ను విడుదల చేసింది. 11.5 అంగుళాల భారీ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ టాబ్లెట్ చదువుకోవడానికి మరియు నోట్స్ రాసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 8000mAh భారీ బ్యాటరీని అమర్చారు ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంటిపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకమైన బ్లూ లైట్ ఫిల్టర్ టెక్నాలజీని ఉపయోగించారు.

ఈ డివైజ్‌లో మీడియాటెక్ జి100 ప్రాసెసర్ మరియు 8GB ర్యామ్ ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు లభించే స్టైలస్ పెన్ నోట్స్ రాయడానికి మరియు స్కెచింగ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్ మరియు రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. అమెరికాలో ప్రస్తుతం దీని ధర సుమారు రూ. 37,700 గా ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *