పదవుల కోసం ఆశలు… జీవన్ రెడ్డి అసంతృప్తి

తెలంగాణ రాజకీయాల్లో పదవుల విషయంలో అసంతృప్తి సహజమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జరుగుతున్న సందర్భంలో, “ప్రస్తుతం నేను కూడా అసంతృప్తితోనే ఉన్నాను. ఎవరికైనా పదవులు రాకపోతే నిరాశ కలగడం సహజం” అని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలు రాష్ట్ర కాంగ్రెస్ లోపలి ఘర్షణలను మరోసారి బహిర్గతం చేశాయి.
గత రోజు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్ ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రధాన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర రాజకీయ సమీకరణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ఘర్షణలను మళ్లీ బయటకు తెచ్చాయి.