పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడిపై అనుష్క శంకర్ సంచలన వ్యాఖ్యలు
February 14, 2026

పండిట్ రవిశంకర్ అతి పిన్న వయస్కుడైన శిష్యుడిగా రిషబ్ రికీరామ్ శర్మకు ఉన్న గుర్తింపును అనుష్క శంకర్ తోసిపుచ్చారు. రిషబ్ నిజానికి రవిశంకర్ సీనియర్ శిష్యుడు పరిమల్ సదాఫల్ వద్ద శిక్షణ పొందారని ఆమె స్పష్టం చేశారు. వీరి మధ్య కుటుంబ పరిచయాలు ఉన్నప్పటికీ, సాంప్రదాయ గురు-శిష్య సంబంధం లేదని వెల్లడించారు.
భారత పర్యటనలో ఉన్న అనుష్క, రిషబ్ ప్రతిభను అంగీకరిస్తూనే ఈ తప్పుడు సమాచారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వైట్ హౌస్‌లో సితార్ వాయించిన ఘనత రిషబ్‌కు ఉన్నప్పటికీ, సంగీత వారసత్వంపై అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.