నీళ్లు తప్పుగా తాగుతున్నారా మీ కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త
March 1, 2026

నీళ్లు తాగే పద్ధతి సరిగ్గా లేకపోతే అది ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల అవి నేరుగా కడుపులోకి వెళ్లి కిడ్నీల వడపోత ప్రక్రియను దెబ్బతీస్తాయి, ఇది భవిష్యత్తులో కీళ్ల నొప్పులకు కూడా దారితీస్తుంది. అందుకే ఎల్లప్పుడూ కూర్చుని చిన్న చిన్న గుక్కలతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీర బరువును బట్టి నీటి పరిమాణం ఉండాలి. ప్రతి 20 కిలోల బరువుకు 1 లీటర్ నీరు అవసరం. భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే ఫ్రిజ్‌లోని చల్లని నీరు రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది, కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగడమే ఉత్తమమని పరిశోధకులు చెబుతున్నారు.