నిజ జీవితంలో ‘శుభలగ్నం’ సినిమా సీన్.. ప్రియురాలి కోసం భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య

నిజ జీవితంలో ‘శుభలగ్నం’ సినిమా సీన్.. ప్రియురాలి కోసం భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెండితెర అద్భుతం ‘శుభలగ్నం’ సినిమాను తలపించేలా ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఆస్తి కోసం భర్తను అమ్ముకున్న భార్య పాత్రను మనం చూశాం, కానీ ఇక్కడ ఒక మహిళ తన భర్త వివాహేతర సంబంధాన్ని ఏకంగా కాసుల పంటగా మార్చుకుంది. 42 ఏళ్ల వ్యక్తి తనకంటే వయసులో పెద్దదైన 52 ఏళ్ల మహిళతో ప్రేమలో పడటమే ఈ డ్రామాకు తెరలేపింది.

విషయం తెలుసుకున్న భార్య కోర్టు మెట్లెక్కినప్పటికీ, భర్త మాత్రం తన ప్రియురాలితోనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో సదరు భార్య ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తన భర్తను శాశ్వతంగా వదిలేయాలంటే రూ.1.5 కోట్లు నగదుతో పాటు, అదనంగా మరో రూ.27 లక్షలు మరియు ఒక ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆశ్చర్యకరంగా భర్త ప్రియురాలు ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించడంతో, కోర్టు సమక్షంలోనే ఈ వింత ఒప్పందం ముగిసింది. భర్తను వదులుకుని కోటీశ్వరురాలైన భార్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *