నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదని తేల్చిచెప్పిన కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదని తేల్చిచెప్పిన కేటీఆర్

తన పేరుతో ‘కేటీఆర్ సేవా సమితి’ లేదా ‘కేటీఆర్ సేన’ వంటి సంస్థలను నిర్వహించడానికి ఎవరికీ అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అటువంటి సంస్థలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని, అభిమానులు ఎవరైనా సామాజిక కార్యక్రమాలు చేయాలనుకుంటే నేరుగా పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మార్చారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర సంపదను ఢిల్లీకి తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *