ద హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థానీ ఆటగాళ్ల ఎంపికపై భారత ప్రాంచైజీలకు ఈసీబీ కీలక లేఖ
February 23, 2026

ఇంగ్లాండ్ వేదికగా జరిగే ‘ద హండ్రెడ్’ లీగ్‌లో పాకిస్థానీ ఆటగాళ్ల భాగస్వామ్యంపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎనిమిది ఫ్రాంచైజీలకు లేఖ రాసింది. ఈ లీగ్ వేలంలో 67 మంది పాక్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే భారతీయ యాజమాన్యంలోని జట్లు వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్న వార్తల నేపథ్యంలో ఈసీబీ స్పందించింది.
అన్ని దేశాల ఆటగాళ్లకు లీగ్‌లో ఆడే అవకాశం ఉంటుందని ఈసీబీ సీఈఓ స్పష్టం చేశారు. అయితే తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం పూర్తిగా ఆయా ఫ్రాంచైజీల ఇష్టానికే వదిలేశారు. దీంతో భారత యజమానుల నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.