ఢిల్లీ హోటల్ నాలుగో అంతస్తు నుండి దూకిన యువతి ప్రాణాలతో బయటపడింది
February 14, 2026

వాలెంటైన్స్ డే ముందు రోజు ఢిల్లీలోని విశ్వాస్ నగర్ హోటల్లో షాకింగ్ ఘటన జరిగింది. తన ప్రియుడితో గొడవ పడి 20 ఏళ్ల యువతి హోటల్ నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే కింద ఉన్న అట్టపెట్టెల కుప్పపై పడటంతో ఆమె ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
వాలెంటైన్స్ డే వేడుకల విషయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడితో గొడవ జరగడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. యువకుడు హోటల్ నుండి వెళ్ళిపోవడంతో ఆవేశంలో యువతి ఈ పనికి పాల్పడింది. పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.