ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల అద్భుత విజయం 20 కిలోల క్యాన్సర్ గడ్డను తొలగించి మహిళకు పునర్జన్మ

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల అద్భుత విజయం 20 కిలోల క్యాన్సర్ గడ్డను తొలగించి మహిళకు పునర్జన్మ

ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ముకుర్‌దీపి రాయ్ అసాధ్యమైన శస్త్రచికిత్సను సుసాధ్యం చేసి చూపారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన 42 ఏళ్ల మున్మున్ ఓజా అనే మహిళ కడుపు నుండి సుమారు 20 కిలోల భారీ ట్యూమర్‌ను ఆయన విజయవంతంగా తొలగించారు. నాల్గవ దశ కోలన్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఇతర వైద్యులు వదిలేసినా, డాక్టర్ రాయ్ సవాలుగా తీసుకుని రెండు విడతల్లో 11 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను పూర్తి చేశారు.

శరీరంలోని వివిధ అవయవాలకు అంటుకుని ఉన్న ఈ భారీ గడ్డను తొలగించడం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ, వైద్య బృందం నైపుణ్యంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. ప్రస్తుతం కోలుకున్న మున్మున్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. క్యాన్సర్ నాల్గవ దశలో ఉన్నప్పటికీ సరైన చికిత్సతో నయం చేయవచ్చని ఈ ఘటన నిరూపించింది. రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శరీరంలో వచ్చే మార్పులను గమనించి తక్షణమే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రాయ్ సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *