డీలిమిటేషన్‌తో దక్షిణాది హక్కులకు గండి: సీఎం రేవంత్

డీలిమిటేషన్‌తో దక్షిణాది హక్కులకు గండి: సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌పై తీవ్రంగా స్పందించారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేకంగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని, అభివృద్ధిలో ముందుండే మన రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత లభించడంలేదని మండిపడ్డారు. “మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో అన్యాయం జరుగుతోంది. తెలంగాణ రూపాయి పన్ను కడితే కేవలం 42 పైసలే మళ్లిస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి ఆరు రూపాయలు ఇస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ (BJP) ఆచరణలోకి తేవాలనుకుంటున్న డీలిమిటేషన్ విధానాన్ని అడ్డుకోవాలని ఇతర పార్టీలను సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. “ఇది అమలైతే మన స్వరాన్ని పార్లమెంటులో వినిపించనీయరు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వానికి బలమైన సందేశం వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *