డచ్ జట్టుపై విరుచుకుపడనున్న సూర్య సేన.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది

నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పరుగుల వరద పారించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
భారత జట్టులో మార్పులు
సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు.
భారత తుది జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
నెదర్లాండ్స్ తుది జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మైకెల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడె, కొలిన్ అకెర్‌మన్, జాక్ లైయన్ కాచెట్, నోవ్ క్రోయిస్, రోలెఫ్ వాన్ డిర్ మెర్వ్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లీన్.
బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ హిట్టర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.