ట్రంప్ సుంకాల వాతతో భారత ఆర్థిక వ్యవస్థపై పడనున్న ప్రభావంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
February 23, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల పెంపు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆమె వెల్లడించారు. దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గతంలో ట్రంప్ జాతీయ ఆర్థిక అత్యవసర చట్టాన్ని ఉపయోగించి భారత్‌తో సహా పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా తీసుకుంటున్న ఈ కఠిన వాణిజ్య నిర్ణయాల వల్ల మన దేశ ఎగుమతులు మరియు ఇతర ఆర్థిక అంశాలపై పడే ప్రభావం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నిశితంగా గమనిస్తోంది.