ట్రంప్ కొత్త ఆదేశంతో H-1B వీసా హోల్డర్లలో కలకలం, ఉద్యోగులను హుటాహుటిన వెనక్కి రప్పిస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్

ట్రంప్ కొత్త ఆదేశంతో H-1B వీసా హోల్డర్లలో కలకలం, ఉద్యోగులను హుటాహుటిన వెనక్కి రప్పిస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా హెచ్-1బి వీసా ఫీజును $1,00,000 వరకు పెంచడం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులలో ఆందోళన కలిగించింది. ఈ ఆదేశం తర్వాత, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యవసర నోటీసులు జారీ చేశాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని, తాత్కాలికంగా విదేశీ పర్యటనలను నిలిపివేయాలని ఆ నోటీసుల్లో కోరాయి.

ట్రంప్ ఆదేశం సెప్టెంబర్ 21 నుంచి 12 నెలల పాటు అమలులోకి వస్తుంది. ఈ ప్రకటన తర్వాత, మెటా మరియు మైక్రోసాఫ్ట్ తమ హెచ్-1బి మరియు హెచ్-4 వీసా హోల్డర్ ఉద్యోగులను 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని కోరాయి. అదే విధంగా, అమెజాన్ కూడా తమ హెచ్-1బి వీసా ఉన్నవారిని దేశంలోనే ఉండమని సూచించింది. ఈ కొత్త నిబంధనల వల్ల వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు అమెరికా తిరిగి రావడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఈ చర్యలు సూచిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *