టెస్ట్ సిరీస్ దెబ్బ: సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియాలో 7 కొత్త ప్లేయర్స్ ఎంట్రీ!

సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఓటమి తర్వాత, టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పూర్తిగా మార్చబడింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు 15 మంది సభ్యుల జట్టు నుండి టెస్ట్ టీమ్‌లోని ఏడుగురు ఆటగాళ్లను తప్పించి, ఏడుగురు కొత్త ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు.
కెఎల్ రాహుల్ నాయకత్వం వహించే ఈ వన్డే జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చారు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో చోటు దక్కింది. టెస్ట్ మరియు వన్డే రెండు జట్లలో కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సహా మొత్తం 8 మంది ఆటగాళ్లు కొనసాగుతున్నారు. ఈ సిరీస్ నవంబర్ 30 న రాంచీలో ప్రారంభమవుతుంది.