టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం, నేపాల్‌ను పది వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఇటలీ

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వంటి దిగ్గజ జట్టును వణికించిన నేపాల్‌కు ఇటలీ జట్టు షాకిచ్చింది. గ్రూప్ దశలో జరిగిన ఈ పోరులో ఇటలీ పది వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత ఓవర్లలో నిలదొక్కుకోలేకపోయింది. ఇటలీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో కేవలం 123 పరుగులకే నేపాల్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ ఏ దశలోనూ తడబడకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయాన్ని అందుకుంది.
ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా (60 నాటౌట్), ఆంథోనీ మోస్కా (62 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి కేవలం 12.4 ఓవర్లలోనే 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. నేపాల్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. బలమైన జట్లకు సవాల్ విసిరిన నేపాల్ ఇలా పసికూన ఇటలీ చేతిలో ఘోరంగా ఓడిపోవడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ విజయంతో ఇటలీ తన సత్తా చాటగా, నేపాల్ జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.