టీ20 ప్రపంచకప్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా
February 22, 2026

న్యూస్ డెస్క్ : టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా ఈ ఆదివారం సాయంత్రం భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు అపజయం లేకుండా ఉండటంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచకప్ వేదికపై దక్షిణాఫ్రికా కంటే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ఇప్పటివరకు జరిగిన 7 ప్రపంచకప్ పోరులో భారత్ 5 సార్లు విజయం సాధించగా, దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఈ రికార్డు భారత అభిమానుల్లో జోష్ నింపుతోంది. నేటి ఉత్కంఠభరిత పోరులో భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.