జైలులో చూపు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్ పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

జైలులో చూపు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్ పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా మారింది. అదియాలా జైలులో ఉన్న ఆయన తన కుడి కంటి చూపును 85 శాతం కోల్పోయినట్లు సంచలన నివేదిక వెల్లడించింది. సుప్రీంకోర్టు నియమించిన అధికారి నివేదిక ప్రకారం, గత అక్టోబర్ వరకు సాధారణంగా ఉన్న ఆయన చూపు ప్రస్తుతం కేవలం 15 శాతానికి పడిపోయింది. కంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య నిపుణులు ధృవీకరించారు.

చీఫ్ జస్టిస్ యాహ్యా అఫ్రిది నేతృత్వంలోని బెంచ్ ఫిబ్రవరి 16లోగా ఇమ్రాన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఖైదీలకు సరైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. తక్షణమే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు శస్త్రచికిత్స లేదా అవసరమైన వైద్యం అందించాలని సూచించింది. అదే సమయంలో ఇమ్రాన్ తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు అనుమతి నిచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *