జూలై 27న పోలవరాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు
March 24, 2025

ఈ నెల 27న ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనులను సమీక్షించి, వాటి పురోగతి గురించి జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
పనుల వేగం, సవాళ్లు, మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల సమకూర్చుకునే విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఆయా విషయాలు గూర్చి సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి అవ్వాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.