జాతకాలు కలవలేదనే సాకుతో పెళ్లి నిరాకరించడం ఇకపై నేరమే
February 24, 2026

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాక, జాతకాలు కలవలేదనే సాకుతో ముఖం చాటేయడం నేరమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి ముందే జాతకాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించిన కోర్టు, నిందితుడి ఉద్దేశం మోసపూరితమైనదని అభిప్రాయపడింది.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం, అబద్ధపు వాగ్దానాలతో మహిళల సమ్మతి పొందడం శిక్షార్హమైన నేరం. వాట్సాప్ చాట్‌ల ఆధారంగా నిందితుడు కావాలనే మోసం చేసినట్లు నిర్ధారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ, ఈ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించారు. మోసపూరిత సమ్మతి చట్టబద్ధం కాదని కోర్టు తేల్చిచెప్పింది.