జాగ్రత్త! కుక్కపిల్లను కాపాడబోయి చిన్న పొరపాటుతో రేబిస్‌తో కబడ్డీ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయారు

ఒక కుక్కపిల్లను రక్షించబోయి కబడ్డీ ఆటగాడు బ్రిజేష్ సోలంకి కుక్కకాటుకు గురయ్యారు. ఈ చిన్న కాటును పెద్దగా పట్టించుకోకుండా రేబిస్ టీకా తీసుకోకపోవడంతో మూడు నెలల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరానా గ్రామానికి చెందిన బ్రిజేష్, మురుగు కాలువలో పడిపోయిన కుక్కపిల్లను రక్షించే క్రమంలో కుక్కకాటుకు గురయ్యారు. అతని సోదరుడు సందీప్, బ్రిజేష్ జూన్ 28న మరణించాడని తెలిపారు.
సందీప్ ఆరోపణల ప్రకారం, జూన్ 26న శ్వాసకోశ సమస్యలు ప్రారంభమైన తర్వాత బ్రిజేష్ ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ప్రభుత్వ ఆసుపత్రులు అతనిని చేర్చుకోవడానికి నిరాకరించాయి, అలీగఢ్ మెడికల్ కాలేజీ కూడా వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో బ్రిజేష్ మంచంపై నొప్పితో విలవిలలాడుతూ కనిపించాడు. అతని కోచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బ్రిజేష్ తన గాయాన్ని కబడ్డీ ఆడుతున్నప్పుడు వచ్చిన గాయంగా భావించాడు, అది అతని అతి పెద్ద తప్పు అని అన్నారు. చిన్న కాటును అతను తేలికగా తీసుకున్నాడు, చివరికి అది అతని ప్రాణాలను బలిగొంది.