జనరేటర్లు పనిచేయకే ఎయిర్పోర్టు మూసివేత!
March 22, 2025

లండన్లోని హీత్రో ఎయిర్పోర్టులో బ్యాకప్ పవర్ సరఫరాపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎయిర్పోర్టు మేనేజ్మెంట్ డీజిల్ జనరేటర్ల స్థానంలో బయోమాస్ జనరేటర్లను ఏర్పాటు చేసింది. అయితే, ప్రధాన సబ్స్టేషన్ అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఎయిర్పోర్టు మొత్తం విద్యుత్ కోల్పోయింది. ఈ కారణంగా నిన్నంతా ఎయిర్పోర్టు సేవలు నిలిచిపోయాయి.
ఈ ఘటన వల్ల సుమారు 1,300 విమానాలు రద్దయ్యాయి, రెండు లక్షలకుపైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సమయంలో బయోమాస్ జనరేటర్లు పని చేయలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రయాణికులు తమ ఫ్లైట్లు రద్దయ్యాయని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు.