చేరిన వారానికే కంపెనీకి కన్నం వేసి 2 లక్షల విలువైన షూస్‌తో ఉద్యోగి పరార్
February 24, 2026

ఢిల్లీకి చెందిన గల్లీ ల్యాబ్స్ స్టార్టప్‌లో కస్టమర్ సపోర్ట్ విభాగంలో చేరిన ఒక ఉద్యోగి ఊహించని మోసానికి పాల్పడ్డాడు. విధుల్లో చేరిన మొదటి వారంలోనే సిస్టమ్ యాక్సెస్‌ను ఉపయోగించి 100 శాతం డిస్కౌంట్ కూపన్లను సృష్టించాడు. వీటి ద్వారా తన స్నేహితుల పేర్లతో సుమారు 2 లక్షల రూపాయల విలువైన షూస్‌ను ఉచితంగా ఆర్డర్ చేసి పని మానేశాడు.
ఈ దారుణం బయటపడటంతో యాజమాన్యం అతడిని నిలదీయగా వాడేసిన కొన్ని షూస్‌ను మాత్రమే తిరిగి ఇచ్చాడు. మిగిలిన వాటికి నగదు చెల్లించాలని కోరడంతో ఏకంగా కంపెనీపైనే వేధింపుల ఆరోపణలు చేస్తూ సదరు మాజీ ఉద్యోగి లీగల్ నోటీసులు పంపడం గమనార్హం. ప్రస్తుతం ఈ వింత ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.