చితిపై నిప్పు పెట్టగానే ఒక్కసారిగా లేచి పరుగులు తీసిన శవం, వైరల్ వీడియో చూసి బంధువుల గుండె గుభేలు

చితిపై నిప్పు పెట్టగానే ఒక్కసారిగా లేచి పరుగులు తీసిన శవం, వైరల్ వీడియో చూసి బంధువుల గుండె గుభేలు

మరణించిన వ్యక్తి తిరిగి బతికి రావడం అనేది వినడానికి వింతగా ఉన్నా, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఒక వృద్ధుడి మరణం తర్వాత అతడి అంత్యక్రియల కోసం బంధువులందరూ శ్మశానానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యక్తిని చితిపై పడుకోబెట్టి, దానిపై కట్టెలు కూడా పేర్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలుకుతూ చితికి నిప్పు అంటించారు. అయితే ఆశ్చర్యకరంగా, చితి నుంచి పొగ రావడం ప్రారంభమవగానే, చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కట్టెలను విసిరికొట్టి చితి పైనుంచి దూకి పరుగులు తీశాడు. ఈ దృశ్యం చూసిన అక్కడ ఉన్న వారంతా భయాందోళనతో నోరెళ్లబెట్టారు.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందినదిగా చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అంత్యక్రియల సమయంలో మృతదేహానికి ఉండాల్సిన వస్త్రధారణ కాకుండా, సదరు వ్యక్తి సాధారణ దుస్తుల్లో ఉండటం ఈ వీడియో విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది కేవలం వినోదం కోసం చిత్రీకరించిన వీడియోనా లేక నిజంగానే జరిగిన సంఘటనా అనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో ఎక్కడిది అనే విషయాన్ని కూడా అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు, కానీ నెటిజన్లు మాత్రం ఈ వింత ఘటనను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *