ఘజియాబాద్ విషాదం ముగ్గురు కూతుళ్లు చనిపోయిన బాధలో ఉన్న తండ్రికి ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు
February 13, 2026

ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు మైనర్ సోదరీమణుల మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కూతుళ్ల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి చేతన్‌ను తక్షణమే ఫ్లాట్ ఖాళీ చేయాలని యజమాని ఆదేశించారు. చేతన్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం వెలుగులోకి రావడంతో, సొసైటీలో తలెత్తిన వివాదాల దృష్ట్యా యజమాని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మరణాల వెనుక ఆన్‌లైన్ కొరియన్ గేమింగ్ టాస్క్‌ల ప్రభావం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికల మొబైల్ ఫోన్లతో పాటు చేతన్ బ్యాంక్ ఖాతా వివరాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఏదైనా ఆన్‌లైన్ సూసైడ్ ఛాలెంజ్ ఈ దారుణానికి దారితీసిందా అనే కోణంలో ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది.