గ్రూప్-1 ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం: కవిత

గ్రూప్-1 ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం: కవిత

BRS ఎమ్మెల్సీ కవిత గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలను ప్రభుత్వం మరియు TGPSC తక్షణమే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించగా, తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యూయేషన్‌లో అన్యాయం జరిగిన విషయంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలు తీవ్రతరంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రూప్-2 ఫలితాల్లో 13,000 మంది అభ్యర్థులను ఇన్వాలిడ్‌గా ప్రకటించిన తీరును ప్రభుత్వం స్పష్టంగా వివరించాలని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *