క్యాన్సర్ రహిత భారతం కోసం బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అందించనున్న కేంద్ర ప్రభుత్వం
February 24, 2026

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అందించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ నిరోధక వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ భారీ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది బాలికల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తులో దేశాన్ని గర్భాశయ క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దడమే ఈ చారిత్రాత్మక నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశం.