కోహ్లీ-రోహిత్‌తో గొడవ కోచ్ గంభీర్, అగార్కర్‌లకు బీసీసీఐ అత్యవసర సమన్లు!
December 2, 2025

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలోనే టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను బీసీసీఐ అత్యవసరంగా పిలిపించింది. జట్టులోని కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో వారికి వృత్తిపరమైన దూరం పెరుగుతోందని బోర్డు అనుమానిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న ఈ అసంతృప్తిపై గంభీర్-అగార్కర్‌లను బోర్డు కఠినంగా వివరణ కోరినట్లు సమాచారం.
ఈ సమస్యను వేగంగా పరిష్కరించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లతో పరిస్థితులను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని గంభీర్, అగార్కర్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ హుటాహుటి పిలుపు భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పట్ల బీసీసీఐ ఎంత ఆందోళనగా ఉందో తెలియజేస్తోంది.