కోచ్‌గా గౌతమ్ గంభీర్ వద్దంటూ అభిమానుల ఆగ్రహం! సిరీస్ ఓటమిపై తీవ్ర నిరసన

కోచ్‌గా గౌతమ్ గంభీర్ వద్దంటూ అభిమానుల ఆగ్రహం! సిరీస్ ఓటమిపై తీవ్ర నిరసన

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2తో భారత జట్టు పరాజయం పాలవడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, గువాహతిలో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి తర్వాత ఈ అసంతృప్తి మరింత పెరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి బయలుదేరుతున్న కొంతమంది అభిమానులు “గౌతమ్ గంభీర్ హాయ్ హాయ్” అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చారిత్రక ఓటమికి కోచ్‌దే పూర్తి బాధ్యత అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 మరియు రెండవ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే జట్టు కుప్పకూలడం.. టీమ్ మేనేజ్‌మెంట్ మరియు వ్యూహాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. గంభీర్ నేతృత్వంలో గత 18 టెస్టుల్లో భారత్ 10 ఓటములు ఎదుర్కోవడంతో, కోచ్‌ను తొలగించాలనే డిమాండ్ బలపడుతోంది. ఓటమికి గంభీర్ బాధ్యత తీసుకున్నప్పటికీ, తన భవిష్యత్తుపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రదర్శన తర్వాత బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *