కేంద్ర బడ్జెట్లో బెంగాల్‌కు భారీ వరాలు కురిసేనా
February 1, 2026

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది బీహార్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి కేంద్రం భారీ కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో, బెంగాల్‌కు కూడా అదే తరహాలో ప్రత్యేక ప్యాకేజీలు లభిస్తాయా అన్న చర్చ మొదలైంది.
ఈసారి బెంగాల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో ఎన్నికల ప్రభావం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ తరహాలోనే బెంగాల్‌పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుందో లేదో తెలియాలంటే బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందే.