కూల్‌డ్రింక్స్‌లో మైక్రోప్లాస్టిక్! ఆరోగ్యానికి ముప్పు?

థాయిలాండ్‌లో నిర్వహించిన తాజా పరిశోధనలో శీతల పానీయాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. ప్యాకేజింగ్ విధానంతో సంబంధం లేకుండా 9 ప్రధాన బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించారు. విశ్లేషణల్లో, ఒక సాధారణ వ్యక్తి సంవత్సరానికి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు వెల్లడైంది. ఈ పానీయాలు అధికంగా తాగితే జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపించి, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంపై మైక్రోప్లాస్టిక్ ప్రభావాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలుగుతుందనే దానిపై మరిన్ని అధ్యయనాలు చేయాలని సూచిస్తున్నారు. కూల్‌డ్రింక్స్ సేవించే ముందు ప్రజలు దీని ప్రభావాలను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవడం మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.