కుల్దీప్ మరియు అక్షర్ పటేల్‌పై సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం

నెదర్లాండ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జట్టులోని స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను తుది జట్టు నుంచి తప్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం సూర్య ఈ మార్పులపై స్పష్టతనిచ్చారు. కుల్దీప్ స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోగా, అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. డ్యూ కండిషన్స్‌లో బౌలర్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారీ స్కోరు సాధించి బౌలర్లపై ఒత్తిడి పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సైతం తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పారు. ఇప్పటికే సూపర్-8కు చేరిన భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి అజేయంగా లీగ్ దశను ముగించాలని పట్టుదలతో ఉంది.